GDWL: దీక్షా విజయ్ దివాస్ సందర్భంగా అలంపూర్ చౌరస్తాలో ఇవాళ తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే విజయుడు పాలభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన చారిత్రక రోజు ఇదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.