MNCL: కాసిపేట్ మండలం బుగ్గగూడా అటవీ ప్రాంతానికి సమీపంలోని రాళ్ళవాగు పక్కన ఉన్న పత్తి చేనులోని ఆవుపై శుక్రవారం పులి దాడి చేసి హతమార్చింది. ఈ ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్కదిగా నిర్ధారించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. సమీప గ్రామాల ప్రజలు,రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.