JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని సిద్దులగుట్టలో నిర్వహించాల్సిన వివిధ బహిరంగ వేలం పాటలు మరోసారి వాయిదా పడినట్లు ఈవో చందం వంశీ శనివారం తెలిపారు. వేలం నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పాల్గొనేవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. తదుపరి వేలం తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.