SRD: జోగిపేట ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీ సమయంలో వైద్యులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెంట్ సామ్యతో పాటు మరో 11 మంది వైద్యులు విద్యులకు రాలేదని గుర్తించారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గైర్హజరైన వైద్యులకు షోకాజు నోటీసులు జారీ చేశారు.