SRD: సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రి ఆవరణలోనే అనుమానాస్పద గాయాలతో గుర్తు తెలియని ఒక మహిళ మృతి చెందగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వయసు 35-40 ఉంటుందని తెలిపారు. మహిళ మృతదేహం మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.