BHNG: బీబీనగర్ సర్పంచ్ ఎన్నికల బరిలో నారగొని మహేష్ గౌడ్ తన భార్య శ్రీలతతో కలిసి పోటీకి దిగారు. జ్యోతిషుడు ఇచ్చిన సలహా మేరకు, భార్యాభర్తలు ఇద్దరూ బరిలో ఉంటే విజయం ఖాయమని భావించి, ఆయన శ్రీలతను నామినేషన్ వేయించారు. అధికారులు విడుదల చేసిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.