MBNR: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఆదివారం ఎంపీ డీకే అరుణ ఆరోపించారు .ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర BJP ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.