NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి గుండు బాలయ్య ఇవాళ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. దోశలు వేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఆమెకు కేటాయించిన ఎన్నికల గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.