SRCL: చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని వీర్నపల్లి మండల ఎస్సై వేముల లక్ష్మణ్ హెచ్చరించారు. చైనా మాంజా వినియోగం వల్ల వాహనాలపై వెళ్తున్న వారి గొంతులు తెగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని, ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.