ADB: ఉట్నూరు మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మర్సుకోల సరస్వతిని సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా ఆదివారం లక్కారంలోనీ నవోదయనగర్, వేణునగర్, రాంజీ గోండ్ నగర్లో ముమ్మర ప్రచారం గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.