ADB: సుంగాపూర్ గ్రామ పంచాయతీ శివారులో చెరువు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సర్పంచ్ పెందుర్ లక్ష్మణ్ మైనర్ ఇరిగేషన్ ఈఈ రాథోడ్ విట్టల్ను కోరారు. కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సుంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చెరువు మంజూరు చేస్తే తాగు, సాగునీరు కోసం గిరిజనులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.