NRML: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ క్లస్టర్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఇందులో ఎంపీడీవో అరుణ రాణి, జూనియర్ అసిస్టెంట్ రమణ ఉన్నారు.