SRCL: వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చడం వల్ల భూసారం కోల్పోవడమే కాకుండా వాతావరణం కలుషితమవుతుందని చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు అన్నారు. మరిగడ్డ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను తగులబెట్టడం ద్వారా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం పంటల నమోదు పరిశీలనలో భాగంగా వివిధ గ్రామాల్లోని సర్వే నంబర్ల భూములను ఆయన పరిశీలించారు.