BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తను నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం మణుగూరు మండలం కమలాపురంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.