ADB: జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశాంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU) శాఖ పక్షాన సేకరించిన రూ. 1,11,000 రూపాయలను బాధితుని కుటుంబీకులకు ఆదివారం అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.