ASF: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం అన్నారు. డిసెంబర్ 02వ తేదీ నుంచి 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.