NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం చూరగొనేందుకు అభ్యర్థులు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచార పంథాను కొనసాగిస్తున్నారు. తన మేనిఫెస్టోలో పేర్కొన్న మాదిరిగా గ్రామాభివృద్ధికి నిజాయితీగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ… చిట్యాల మండలం ఆరెగూడెంలో స్ఫూర్తి సేన యూత్ నుంచి స్వతంత్రంగా బరిలో ఆరూరి శివకుమార్ గ్రామ ఓటర్లకు నమ్మకం కలిగిస్తున్నాడు.