JN: పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సీఐ జానకీ రాంరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజ్ కుమార్, వెంకటరమణ,శ్రీనివాస్ పాల్గొన్నారు.