HYD: విరమణ ఉద్యోగానికే కానీ.. సేవకెక్కడిదని GHMC మాజీ ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు నిరూపించారు. GHMCలో ఎంటమాలజీ చీఫ్ స్థాయిలో ఎంతో ఓపికగా విస్తృత సేవలు అందించిన ఆయన ఉద్యోగానికి విరమణ పొందారు. అయినప్పటికీ తన సేవను మాత్రం ఎక్కడ ఆపలేదు. తనకు వచ్చిన విద్యను, వైద్యాన్ని ప్రజలకు పంచుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నారు.