HYD: చర్లపల్లి టెర్మినల్ నుంచి తార్నాక, ఉప్పల్, నారాయణగూడ సహా పలు ప్రాంతాలకు రాత్రి వేళల్లో కూడా బస్సులు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. గతంలో బస్సులు లేక ఆటోలు, క్యాబ్లపై ఆధారపడాల్సి వచ్చేదని చెబుతున్నారు.