PDPL: అంతర్గాం మండల పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 ఏళ్ల వయసు గల సమీప బంధువు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అంతర్గాం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.