ADB: మొక్క జొన్న పంట సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు డా. రాజ శేఖర్, డా. మోహన్ దాస్ సూచించారు. మంగళవారం జైనాథ్ మండలంలోని నిరాల, లేఖర్ వాడ, ఆడ గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. మొక్క జొన్న సాగులో బొలింగ్ తెగులు గుర్తించి నివారణకు చేపట్టవల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.