NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల, పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లారీల రవాణా, హమాలీల అందుబాటు, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం పరిమాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.