NLG: రాజకీయాల్లో మార్పు రావాలని, యువతకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లికి 200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి భరత్‌కు అని వర్గాల ప్రజల అండదండ ఉందన్నారు. పనిచేసే వ్యక్తిని గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.