BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ 1వ వార్డులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ ప్రచారం నిర్వహించారు. సీపీఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలబోయిన మాధవరావు బ్యాటు గుర్తు, అలాగే 1వ వార్డు సభ్యుడు గాండ్ల సురేష్ గ్యాస్ స్టవ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.