ములుగు మండలంలో 6 సర్పంచ్, 74 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సర్పంచ్ బరి నుంచి 39 మంది వార్డుల బరి నుంచి 116 మంది తప్పుకున్నారు. దీంతో 13 సర్పంచ్ స్థానాలు, 98 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 48 మంది, వార్డుల బరిలో 300 మంది నిలిచారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఏకగ్రీవాల సంఖ్య పెరగడం గమనార్హం.