ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పనిచేసిన రుద్రారపు హరీశ్ గత ఏడాది డిసెంబర్ 2న ఆత్మహత్య చేసుకున్న ఘటనకు నేటికి ఏడాది పూర్తయింది. ముళ్లకట్ట సమీపంలోని రిసార్టులో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన మృతి చెందారు. ప్రేమ వ్యవహారమే మరణానికి కారణమని, ఆ సమయంలో ఓ యువతి ఆయనతో రిసార్టులో ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.