SDPT: అక్కన్నపేట మండలం కట్కూర్, అంతకపేట గ్రామాల్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎస్సై చాతరాజు ప్రశాంత్, పోలీస్ సిబ్బందితో కలిసి బైకులపై తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు, మద్యం రవాణా చేస్తూ దొరికితే తక్షణమే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ను దృష్ట్యా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు