GDWL: విద్యార్థిపై ఉపాధ్యాయుడు శారీరకంగా దాడి చేసిన సంఘటనపై తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపాడు. గద్వాల మండలం, వీరాపురం సమీపంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి థామస్‌పై దాడి జరిగింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయుడి నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేశారు.