SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన తోట అజయ్ (18) అనే యువకుడు ఆదివారం ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. యువకుడు సరదాగా ఈత కొట్టడం కోసం బావిలోకి దిగి, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. అజయ్ ఆచూకీ కోసం గ్రామస్థులు, ఈతగాళ్లు బావిలో తీవ్రంగా గాలిస్తున్నారు.