ASF: ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్ జిల్లా కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని నీతి అయోగ్ కేంద్ర ప్రభారి రజత్ కుమార్ సైని అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నీతి అయోగ్ ద్వారా చేపడుతున్న మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో కలిసి సమీక్షించారు. మారుమూల గ్రామాలలో ఇంటర్ నెట్, రోడ్లు, పక్కా ఇళ్ళు అందించేందుకు కృషి చేయాలన్నారు.