MDK: రాబోయే కాలంలో కార్మిక వర్గం అత్యంతభయంకరమైన పరిస్తితులు ఎదుర్కొబోతున్నదనీ, ఆ విధానాలకు ధీటుగా కార్మిక వర్గం అత్యంత సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపు నిచ్చారు. లేబర్ కోడ్ల ప్రమాదం గురించి ఎక్కడ బడితే అక్కడ, గ్రామాలు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.