SDPT: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎదురుగా రూ.1.30 కోట్లతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన కొయోస్కో సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ సూచించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు రూ. 50 వేల వరకు లోన్ కూడా అందిస్తామని, రుణాల మంజూరు ప్రక్రియను 2030 వరకు పొడిగించారని ఆయన తెలిపారు.