ADB: బోథ్ మండల కేంద్రంలోని షాదీఖానా భవన ఆధునీకరణకు రూ. 50 లక్షలు మంజూరు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ కోరగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నిధుల విడుదల కోసం మైనారిటీ ఫైనాన్స్ ఎండీకి రిఫరెన్స్ పంపినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.