BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. నిత్య కల్యాణం, ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు.