MNCL: సింగరేణి వ్యాప్తంగా బొగ్గు, మైనింగ్ వ్యర్థాల నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇతర కీలక ఖనిజాలను అన్వేషించి వెలికి తీసేందుకు ప్రముఖ పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్తో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ సీఅండ్ఎండీ బలరామ్ సమక్షంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరుపక్షాలు మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.