GDWL: గద్వాలలో వెలసిన సంతాన వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆదివారం ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వెంకటాద్రి రెడ్డి ఆవిష్కరించారు. 10వ తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం, 11వ తేదీన రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.