BDK: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య సేవలు పొందిన పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 5.7,65,000 చెక్కులను లబ్ధిదారులు అందజేశారు.