KMR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భవంగా నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.