BHPL: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆన్లైన్ చేయు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీవోసీ కార్యాలయం నుంచి ఆన్లైన్ ప్రక్రియ నిర్వహణపై రెవెన్యూ, పంచాయితీ రాజ్, ప్రణాళిక, మండల, మున్సిపల్ ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి అవుతుందన్నారు.