NRML: బాసర మండలం ఓని గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను గ్రామస్థులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల మధ్య మహిళలు బోనాలతో గ్రామ దేవతల ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. కొత్త కుండల్లో వండిన అన్నం, బెల్లం, పాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు.