GDWL: గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి నా లక్ష్యం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం మల్డకల్ మండలం మద్దెల బండ గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు నాణ్యతతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.