SRD: ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దేవాలయ ప్రదాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఆలయ పురవీధుల మీదుగా నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు.