KMM: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మధిరలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆమె తెలిపారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.