SRCL: తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ఈవై స్కిల్ బ్రిడ్జి ప్రాజెక్టులో భాగంగా గత నవంబర్ నెలలో నిర్వహించారు. బెబ్రాస్ ఇండియా చాలెంజ్ టెస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంఈవో రాజు గురువారం సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు.