NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు పోతామన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసిందన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ విజయం సాధించినా నైతిక విజయం BRS పార్టీదేనని అన్నారు.