PDPL: ధర్మారం శివారులో 13 ఎకరాల్లో తాటి చెట్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం మండల నాయకులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలపై స్థానికులను ఆరా తీసి, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ గౌడ కులస్థుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారన్నారు.