ADB: బ్యాంకులలో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. సీసీ టీవీలు, మోషన్స్ సెన్సార్, అత్యాధునిక అలారం పద్ధతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ మండలం రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇటీవల అంతరాష్ట్ర దొంగల ముఠా దొంగతనానికి యత్నించగా బ్యాంకు సిబ్బందితో భద్రత చర్యలపై, ఏర్పాటుపై ఎస్పీ సమీక్షించి, ఘటన స్థలాన్ని పరిశీలించారు.