MDK: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో చెరువు కట్ట మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువు కట్టను బల పరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని సర్పంచ్ బలరాజ్, అధికారులు తెలిపారు.