BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రధాన కేంద్రంలో మరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు వ్యక్తి అస్వస్థతకు గురై వాంతులు చేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల పెరుగుతున్న ఎండల తీవ్రతతో వడదెబ్బ కేసులు అధికమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.